భర్తను బెడ్‌రూమ్‌లోనే..! | Wife buries husband in bedroom in chhatisgarh | Sakshi
Sakshi News home page

భర్తను బెడ్‌రూమ్‌లోనే..!

Sep 28 2016 5:21 PM | Updated on Sep 4 2017 3:24 PM

భర్తను బెడ్‌రూమ్‌లోనే..!

భర్తను బెడ్‌రూమ్‌లోనే..!

తన భర్త ఏడాదికాలంగా కనిపించకుండాపోయారని ఆమె ఇన్నాళ్లు చెప్తూ వచ్చింది.

రాయ్‌పూర్‌: తన భర్త ఏడాదికాలంగా కనిపించకుండాపోయారని ఆమె ఇన్నాళ్లు చెప్తూ వచ్చింది. కానీ ఆమెను పోలీసులు అరెస్టు చేయడంతో అసలు బండారం బట్టబయలు అయింది. భర్తను ఆమె తన ఇంట్లోని బెడ్రూమ్‌లోనే సమాధి చేసినట్టు వెలుగుచూసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

ఇంట్లోని పడక గదిలో కింద పూడ్చిపెట్టిన 45 ఏళ్ల రాజ్విందర్‌ సింగ్‌ మృతదేహాన్ని తాజాగా పోలీసులు వెలికితీశారు. అయితే, తన భర్తను తాను చంపలేదని, అతను అకాల మృత్యువాత పడటంతో అంత్యక్రియలకు డబ్బులు లేక.. ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టు అతని భార్య మన్‌ప్రీత్‌ కౌర్‌ (40) చెప్తున్నారు. ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నదని ఇరుగుపొరుగువారు చెప్పడంతో అనుమానించిన పోలీసులు ఇంట్లో తవ్వకాలు జరపడంతో ఈ ఘటన వెలుగుచూసింది. అయితే, సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, సమాధి నిర్మించడానికి డబ్బులు లేకపోవడంతోనే ఆమె ఇలా భర్తను ఇంటిలోనే సమాధి చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా విచారించడానికి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement