breaking news
Wife buries husband
-
భర్తను గొడ్డలితో నరికిన భార్య
కురవి(డోర్నకల్): దసరా పండుగ రోజు మద్యం తాగి వచ్చి గొడవ పడడంతో ఆగ్రహించిన భార్య గొడ్డలితో భర్తను నరకగా అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. దసరా పండుగ సందర్భంగా రాజోలు గ్రామంలో మీరంపల్లి ఉపేందర్ తాగిన మైకంలో భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన భార్య సావిత్రి గొడ్డలితో అతడి తలపై నరికింది. తీవ్రంగా గాయపడగా మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంకు తరలించారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సఅందిస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని కురవి ఎస్సై నాగభూషణం తెలిపారు. -
భర్తను బెడ్రూమ్లోనే..!
రాయ్‌పూర్: తన భర్త ఏడాదికాలంగా కనిపించకుండాపోయారని ఆమె ఇన్నాళ్లు చెప్తూ వచ్చింది. కానీ ఆమెను పోలీసులు అరెస్టు చేయడంతో అసలు బండారం బట్టబయలు అయింది. భర్తను ఆమె తన ఇంట్లోని బెడ్రూమ్లోనే సమాధి చేసినట్టు వెలుగుచూసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఇంట్లోని పడక గదిలో కింద పూడ్చిపెట్టిన 45 ఏళ్ల రాజ్విందర్ సింగ్ మృతదేహాన్ని తాజాగా పోలీసులు వెలికితీశారు. అయితే, తన భర్తను తాను చంపలేదని, అతను అకాల మృత్యువాత పడటంతో అంత్యక్రియలకు డబ్బులు లేక.. ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టు అతని భార్య మన్‌ప్రీత్ కౌర్ (40) చెప్తున్నారు. ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నదని ఇరుగుపొరుగువారు చెప్పడంతో అనుమానించిన పోలీసులు ఇంట్లో తవ్వకాలు జరపడంతో ఈ ఘటన వెలుగుచూసింది. అయితే, సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, సమాధి నిర్మించడానికి డబ్బులు లేకపోవడంతోనే ఆమె ఇలా భర్తను ఇంటిలోనే సమాధి చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసును సమగ్రంగా విచారించడానికి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.