భారత మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా తొలి అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. రేపటి నుంచి భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్‌గా మంధానకు ఇదే తొలి టీ20 సిరీస్ కానుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే భారత్‌ను గెలిపించాలనే పట్టుదలతో ఉంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన రెండుసార్లు టైటిల్‌ను అందుకోవడం విశేషం. మరి పూర్తిస్థాయి కెప్టెన్‌గా మంధాన తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.
ఈ నేపథ్యంలోనే కెప్టెన్ కమ్ బ్యాటర్‌గా ఉన్న స్మృతి మంధానను ఒక ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. మంధాన మరో 133 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 5వేల పరుగులు పూర్తి చేసుకోనుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా బ్యాటర్‌గా మంధాన ప్రపంచ రికార్డు అందుకోనుంది. ఇప్పటివరకు మంధాన 179 మ్యాచ్‌ల్లో 127.5 స్ట్రైక్‌రేట్‌తో 4,867 పరుగులు చేసింది. ఆమె ఖాతాలో రెండు సెంచరీలు, 37 అర్థసెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం మంధాన ఉన్న ఫామ్ దృష్ట్యా ఈ సిరీస్‌లోనే ఆమె 5వేల పరుగుల మార్క్‌ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మంధాన తర్వాత అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ (4,758 పరుగులు*) రెండో స్థానంలో ఉండగా, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (4,327 పరుగులు*), శ్రీలంక కెప్టెన్ చమేరి ఆటపట్టు (4,282 పరుగులు*) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇరుజట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు వరుసగా అక్టోబర్ 16, 18, 20వ తేదీల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు రాయ్‌పూర్ ఆతిథ్యమివ్వనుంది. ఆ తర్వాత వడోదర వేదికగా అక్టోబర్ 23, 25, 28 తేదీల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఇక భారత్, జింబాబ్వే మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కావడం విశేషం.
Taking charge to 𝙪𝙨𝙝𝙚𝙧 𝙞𝙣 𝙖 𝙣𝙚𝙬 𝙚𝙧𝙖 ✨🫡 🎥 Soak in Smriti Mandhana's 1️⃣st day in training as #TeamIndia Captain 🇮🇳 #INDvZIM | @mandhana_smriti | @mflone_ https://t.co/EMLJrJmISS
— BCCI Women (@BCCIWomen) October 13, 2026
ఇదీ చదవండి:


