ఆమె తప్పేంలేదు: రాజ్ నాథ్

న్యూఢిల్లీ: లలిత్ మోదీకి వీసా వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తప్పేంలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో ఆమె కరెక్టుగానే వ్యవహారించారని సమర్థించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మానవతా దృక్పథంతోనే లలిత్ మోదీకి సుష్మ సహాయం చేశారని తెలిపారు. ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా కోసం సుష్మా స్వరాజ్ సిఫార్సు చేశారని ఆరోపణలు రావడంతో ఆమె రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేశాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి