చౌక ధరకే పెట్రోల్‌! | WE will give petrol and LPG cheaper prices | Sakshi
Sakshi News home page

చౌక ధరకే పెట్రోల్‌!

Jan 22 2017 6:15 PM | Updated on Sep 5 2018 3:24 PM

చౌక ధరకే పెట్రోల్‌! - Sakshi

చౌక ధరకే పెట్రోల్‌!

రానున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే పెట్రోల్‌ చౌక ధరకు అందిస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు అమరిందర్‌ సింగ్‌ ప్రకటించారు.

  • ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరనూ తగ్గిస్తాం
  • విద్యుత్‌ బిల్లుల్లో కోత పెడతాం
  • పంజాబ్‌ ఓటర్లకు మరిన్ని వరాలు కురిపించిన అమరిందర్‌ సింగ్‌
  • జలంధర్‌: రానున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే పెట్రోల్‌ చౌక ధరకు అందిస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు అమరిందర్‌ సింగ్‌ ప్రకటించారు. ఎల్పీజీ సిలిండర్‌ ధరను కూడా తగ్గిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ బిల్లులను పదిశాతం మేర తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ మ్యానిఫెస్టోను విడుదల చేసినప్పటికీ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈమేరకు అదనపు వరాలను అమరిందర్‌ గుప్పించారు.

    అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం జోరుగా ప్రచారం చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్‌ సిటిజన్లకు, విద్యార్థులకు రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అదనంగా మాజీ సైనికులు, పోలీసులు, పారామిలిటరీ బలగాలకు కూడా బస్సులలో ఉచిత ప్రయాణాన్ని అందిస్తామన్నారు. పంజాబ్‌లోని అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని.. తాము మ్యానిఫెస్టోను ఈ మేరకు విస్తరించబోతున్నామని, ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement