వస్త్ర‘దారుణాలు’ | warrest dress code | Sakshi
Sakshi News home page

వస్త్ర‘దారుణాలు’

Aug 31 2014 12:19 AM | Updated on Apr 4 2019 3:25 PM

వస్త్ర‘దారుణాలు’ - Sakshi

వస్త్ర‘దారుణాలు’

వీరంతా అమెరికా మాజీ అధ్యక్షులు.. ఓ పత్రిక వీరి డ్రెస్సులు చూసి.. చీ.. తూ.. యాక్.. అనేసింది.

వీరంతా అమెరికా మాజీ అధ్యక్షులు.. ఓ పత్రిక వీరి డ్రెస్సులు చూసి.. చీ.. తూ.. యాక్.. అనేసింది. ‘డెయిలీ మెయిల్’ రూపొందించిన ‘‘ఫ్యాషన్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షులు పాల్పడిన వస్త్ర‘దారుణాలు’-20’’ జాబితాలో వీరు టాప్-3లో ఉన్నారు.
 
నంబర్-1: రోనాల్డ్ రీగన్.. 1984లో అయోవాకు ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో వెళ్తున్నప్పుడు తన సిబ్బంది ఉద్దేశించి.. ప్రసంగిస్తున్న దృశ్యమిదీ.. ఇందులో ఆయన రెగ్యులర్ షర్ట్, షూ వేసుకున్నా.. నైట్ డ్రెస్ కింద వాడుకునే ప్యాంట్‌లాంటిదాన్ని వేసుకున్నారు. అదీ.. నడుముకి ఎంతెత్తున కట్టారో చూడండి.. ఇంత చండాలమైన కాంబినేషన్ వేసుకున్నారు కాబట్టే.. ఈయనకు జాబితాలో మొదటి ప్లేసు దక్కింది.
 
 నంబర్-2: మన గూఢచారి చిత్రాల్లోని హీరోలు వేసుకున్న డ్రెస్‌లా బాగుందనే అనిపిస్తోంది కానీ.. అమెరికాలో అధ్యక్షుడి స్థాయి వ్యక్తి ఇలా టెక్సాస్‌లోని కౌబాయ్‌లా టింగురంగా అంటూ తయారవడం బాగోలేదట. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ డ్రెస్ వేశారు.
 
 నంబర్-3: షార్ట్స్‌కు తక్కువ.. చెడ్డీకి ఎక్కువలా కనిపిస్తున్న ఈ పొట్టి షార్ట్స్‌ను 1992లో బిల్ క్లింటన్ వేసుకున్నారు. ఉదయం జాగింగ్‌కు వెళ్తున్నప్పుడు ఆయన వేసుకున్న ఈ డ్రెస్ చాలా మందికి పెద్దగా నచ్చలేదట. టాప్-3లో వీరున్నా.. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా సహా పలువురు మాజీ అధ్యక్షులు టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement