20ఎంపీ కెమెరాతో కొత్త స్మార్ట్ఫోన్ | Vivo V5 Launched in India: Price, Release Date, Specifications, and More | Sakshi
Sakshi News home page

20ఎంపీ కెమెరాతో కొత్త స్మార్ట్ఫోన్

Nov 15 2016 1:58 PM | Updated on Sep 4 2017 8:10 PM

20ఎంపీ కెమెరాతో  కొత్త స్మార్ట్ఫోన్

20ఎంపీ కెమెరాతో కొత్త స్మార్ట్ఫోన్

ప్రముఖ మొబైల్ మేకర్ వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది.

ముంబై:  ప్రముఖ మొబైల్  మేకర్  వివో తన  సరికొత్త స్మార్ట్ ఫోన్ ను  మంగళవారం మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన  ఫీచర్స్ తో వస్తున్న    వివో వి 5 ను తీసుకొచ్చింది. ముఖ్యంగా 20  మెగా పిక్సెల్ కెమెరా దీంట్లోని  ప్రధాన ఆకర్షణ.     ముందస్తు బుకింగ్ కోసం  బుధవారం నుంచి 22 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉండనున్నట్టు, నవంబరు 26 నుంచి అమ్మకాలు మొదలు కానున్నట్టు కంపెనీ పక్రటించింది.  రూ.17,980గా  ధరని నిర్ణయించింది. దీంతో పాటుగా వి5  ప్లస్ ను కూడా  త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. గ్రే, గోల్డ్, అండ్  స్పేస్ గ్రేస్  తీవ్ర వేరియంట్ కలర్స్ లో ఈ  స్మార్ట్ ఫోన్  అందుబాటులోకి రానుంది.  20  మెగా పిక్సెల్  సెల్పీ కెమెరా తో వస్తున్న  ప్రపంచంలోనే మొట్టమొదటి   స్మార్ట్ ఫోన్  అని టెక్ పండితులు చెబుతున్నారు. కాగా  ఈ డివైస్ లోఫేస్ బ్యూటీ, 6.0 యాప్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమిల్లౌ,  విత్ ఫన్ టచ్ 2.6  ఓఎస్ దీని అదనపు  ప్రత్యేకతలు.  

  వివో వి 5  ఫీచర్స్

మెటల్  యూనీబాడీ డిజైన్, డ్యుయల్ సిమ్,
5.5 హెచ్ డీ డిస్ ప్లే (720x1280ఎంపీ)
20 ఎంపీ  సెల్పీ కెమెరా
13 ఎంపీ రియర్ కెమెరా
4 జీబీ ర్యాం
32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మొమొరీ
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
 

 

Advertisement
 
Advertisement
Advertisement