వెంకీ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్.. నాగవంశీ హింట్ | Venkatesh Aadarsha Kutumbam Release date clarity by Naga Vamshi | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Movie: 'ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్.. ఆయనదే పూర్తి బాధ్యత'

Oct 18 2026 10:19 AM | Updated on Oct 18 2026 10:51 AM

Venkatesh Aadarsha Kutumbam Release date clarity by Naga Vamshi

వెంకటేశ్-‍త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా 'ఆదర్శ కుటుంబం'. అక్టోబర్ 2న రావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. దీంతో ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా అని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఆదర్శ కుటుంబం విడుదల తేదీ బాధ్యతలను వెంకటేశ్‌కే అప్పగించినట్లు తెలిపారు.

వరుస వాయిదాలతో సతమతమవుతున్న ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ పూర్తి క్లారిటీ ఇచ్చారు రజినీకాంత్ జైలర్ 2 ప్రెస్ మీట్‌లో ఆదర్శ కుటుంబం విడుదల గురించి మాట్లాడారు. ముందుగా అనుకున్నట్లుగానే అక్టోబర్ 30న థియేటర్లలోకి వస్తుందని పరోక్షంగా హింట్ ఇ‍చ్చారు.  వరుస వాయిదాల పడడంతో తనపై తానే సెటైర్స్ వేసుకున్నారు.

నాగవంశీ మాట్లాడుతూ..' గతంలో సినిమా వాయిదా వేసినప్పుడు అక్టోబర్ 30న వస్తున్నారా అని నన్ను మీడియా మిత్రులు అడిగారు. మీరు అనుకుంటున్న తేదీకే సినిమా రావడం ఖాయం.. కానీ ఈసారి  తేదీని నేను అధికారికంగా ప్రకటించను. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మళ్లీ వాయిదా పడితే ఇక నన్ను జనాలు నమ్మరు. పైగా తంతారేమో" అంటూ ఆయన సరదా కామెంట్స్ చేశారు.  వెంకటేశ్ హైదరాబాద్‌ రాగానే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహిస్తామని నాగవంశీ వివరించారు. వేదికపైనే  వెంకటేశ్‌ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తారని స్పష్టం చేశారు. ఈ ప్రకటనలో ఆదర్శ కుటుంబం మరోసారి వాయిదా పడదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement