రేప్ కేసులో ఇరుక్కున్న సినిమా నటుడు | Vishal Thakkar booked for raping TV actress | Sakshi
Sakshi News home page

రేప్ కేసులో ఇరుక్కున్న సినిమా నటుడు

Oct 20 2015 10:11 AM | Updated on Apr 3 2019 6:34 PM

రేప్ కేసులో ఇరుక్కున్న సినిమా నటుడు - Sakshi

రేప్ కేసులో ఇరుక్కున్న సినిమా నటుడు

బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ పై రేప్ కేసులో ఇరుక్కున్నాడు.

ముంబై: బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ పై రేప్ కేసులో ఇరుక్కున్నాడు. టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు అతడిపై ముంబైలో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు చార్ కోప్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ రామచంద్ర గైక్వాడ్ తెలిపారు. విశాల్ నివాసంలో తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు.

బాధితురాలు పలు టీవీ సీరియల్స్ లో నటించిందని పోలీసులు తెలిపారు. మిగతా వివరాలు వెల్లడించలేదు. విశాల్ పై 376(రేప్), 420(చీటింగ్), 323, 509, 506(క్రిమినల్ ఇంటిమిడేషన్) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు విశాల్ థక్కర్... మున్నాభాయ్ ఎంబీబీఎస్, టాంగో చార్లి, చాందిని బార్ తదితర సినిమాల్లో నటించాడు. అతడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement