నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: మాల్యా | Vijay Mallya's twitter account hacked | Sakshi
Sakshi News home page

నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: మాల్యా

Dec 9 2016 12:36 PM | Updated on Aug 25 2018 6:49 PM

నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: మాల్యా - Sakshi

నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు: మాల్యా

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ట్విట్టర్‌ ఎకౌంట్‌ను హ్యాక్‌ చేశారు.

న్యూఢిల్లీ: లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ట్విట్టర్‌ ఎకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. కొన్ని రోజుల క్రితం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఎకౌంట్‌ను హ్యాక్‌ చేసిన గ్రూపే ఈ పనికి పాల్పడింది. మాల్యాను కించపరిచేలా వరుసగా ట్వీట్లు చేశారు. మాల్యా వెంటనే ఈ విషయం గ్రహించి ఫాలోవర్స్‌కు తెలియజేశాడు.

‘శుక్రవారం ఉదయం నా ట్విట్టర్‌ ఎకౌంట్‌​ను హ్యాక్‌ చేశారు. నా పేరు మీద కొన్ని ట్వీట్లు చేశారు. వాటిని నమ్మకండి. సంబంధిత గ్రూపు నా ఈమెయిల్‌ ఎకౌంట్స్‌ను హ్యాక్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. వాట్‌ ఏ జోక్‌!!’ అని మాల్యా ట్వీట్‌ చేశాడు. కాగా వివిధ బ్యాంకుల్లో మాల్యా సంపద, పాస్‌ వర్డ్‌ వివరాలతో మళ్లీ వస్తామని హ్యాకర్లు ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో అందరూ మాకు మద్దతుగా నిలవాలని హ్యాకర్లు కోరారు. ఇదిలావుండగా బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో విచారణకు సహకరించకుండా మాల్యా ఇంగ్లండ్‌ లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement