షాకింగ్‌: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే! | Video shows deadly assault on Kim Jong Nam | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే!

Feb 20 2017 12:32 PM | Updated on Jul 29 2019 5:39 PM

షాకింగ్‌: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే! - Sakshi

షాకింగ్‌: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే!

కిమ్‌ జాంగ్‌ నామ్‌ను మలేషియాలోని విమానాశ్రయంలో దారుణంగా చంపిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగుచూసింది.

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ సవతి సోదరుడు కిమ్‌ జాంగ్‌ నామ్‌ను మలేషియాలోని విమానాశ్రయంలో దారుణంగా చంపిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగుచూసింది. అనూహ్యరీతిలో ఒక మహిళ నామ్‌పై వెనుక నుంచి దాడిచేసి.. ముఖానికి వేగంగా పనిచేసే విషాన్ని పూయడంతో ఆయన చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెల్లని దుస్తులు ధరించిన మహిళ వెనుక నుంచి నామ్‌ ముఖాన్ని పట్టుకొని.. ఏదో పూస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను జపాన్‌కు చెందిన ఫుజి టీవీ విడుదల చేసింది. నామ్‌పై దాడి దృశ్యాలను ఎయిర్‌పోర్టు సీసీ టీవీ కెమెరాలు రెండు కోణాలలో చిత్రీకరించినట్టు ఈ వీడియోను బట్టి తెలుస్తున్నది.

Advertisement
 
Advertisement
Advertisement