యూఎస్ పర్యాటకురాలిపై అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష | US national gangrape: Himachal court convicts three Nepalese | Sakshi
Sakshi News home page

యూఎస్ పర్యాటకురాలిపై అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష

Dec 18 2013 10:05 AM | Updated on Sep 2 2017 1:45 AM

యూఎస్ పర్యాటకురాలిపై అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష

యూఎస్ పర్యాటకురాలిపై అత్యాచారం: నిందితులకు జైలు శిక్ష

భారత్లో అందాలు వీక్షించేందుకు వచ్చిన యూఎస్ పర్యాటకురాలి (30)పై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు యువకులుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను కులుమనాలీ కోర్టు ఖరారు చేసింది.

భారత్లో అందాలు వీక్షించేందుకు వచ్చిన యూఎస్ పర్యాటకురాలు (30)పై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు యువకులుకు 20 ఏళ్ల  కఠిన కారాగార శిక్షను కూలుమనాలీ కోర్టు ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా జడ్జి పురంధర్ వైద్య తీర్పు వెలువరించారు. అలాగే ఒకొక్కరికి రూ 10 వేలు చొప్పును జరిమాన విధించారు.

 

ఓ వేళ నిందితులు జరిమాన చెల్లించలేని పక్షంలో మరో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని జడ్జి స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్లో యూఎస్కు చెందిన ఓ యువతి భారతలో పర్యాటించేందుకు న్యూఢిల్లీ చేరుకుంది. ఆ క్రమంలో హిమాచల్ప్రదేశ్లోని అందాలు వీక్షించేందుకు కూలుమనాలి విచ్చేసింది. అయితే లిఫ్ట్ ఇస్తామని చెప్పి ముగ్గురు నేపాలీ డ్రైవర్లు ఆ యువతిపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

 

అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు తీసుకుని పరారైయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పలువురు కారు డ్రైవర్లను పోలీసులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, నిందితులను అరెస్ట్ చేశారు. దాంతో నిందితులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులంతా నేపాల్కు చెందిన వారని, హిమాచల్ ప్రదేశ్లో కారులను బాడుగకు తీసుకుని నడుపుతూ జీవనం సాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement