ఫేస్బుక్ పోస్ట్ మూల్యం.. అరకోటి!! | US girl Facebook post costs her dad USD 80,000 | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ పోస్ట్ మూల్యం.. అరకోటి!!

Mar 4 2014 1:23 PM | Updated on Apr 4 2019 5:12 PM

ఫేస్బుక్ పోస్ట్ మూల్యం.. అరకోటి!! - Sakshi

ఫేస్బుక్ పోస్ట్ మూల్యం.. అరకోటి!!

చేతులు ఖాళీగా ఉన్నాయి కదాని ఏం చేయాలో తోచక ఫేస్బుక్లో నోటికి వచ్చింది పోస్ట్ చేసేస్తే చాలా ఇబ్బందులలో పడతారు జాగ్రత్త.

చేతులు ఖాళీగా ఉన్నాయి కదాని ఏం చేయాలో తోచక ఫేస్బుక్లో నోటికి వచ్చింది పోస్ట్ చేసేస్తే చాలా ఇబ్బందులలో పడతారు జాగ్రత్త. ఎందుకంటే, అమెరికాలో ఓ అమ్మాయి ఇలాగే ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆమె తండ్రి అక్షరాలా అరకోటి జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. పాట్రిక్ స్నే (69) అనే పెద్దాయన ఫ్లోరిడాలోని గలివర్ ప్రిపరేటరీ స్కూలుకు గతంలో హెడ్మాస్టరుగా పనిచేశారు. ఆయన కుమార్తె డానా ఈ పాఠశాలను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తన ఫేస్బుక్ పేజీలో రాసింది.

వేసవిలో తాను వెళ్లబోయే యూరప్ పర్యటనకు గలివర్ స్కూలు డబ్బు చెల్లిస్తుందని అంటూ.. అక్కడే బూతులు కూడా రాసింది. ఇది ఆ స్కూలు ఫేస్బుక్ పేజీకి ఉన్న 1200 మందికి ఆ సందేశం వెళ్లిపోయింది. దాంతో, సదరు పాఠశాల దీనిపై భగ్గుమంది. పాఠశాలకు చెందిన మాజీ ఉద్యోగి, ఆయన కుమార్తె కలిసి నిబంధనలను ఉల్లంఘించారని కేసు వేసింది. కేసు నుంచి బయటపడేందుకు సదరు మాజీ హెడ్మాస్టారు దాదాపు అరకోటి రూపాయలు పరిహారంగా చెల్లించుకోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement