రెండు విమానాలు ఢీ: నలుగురు మృతి | US authorities: 4 dead in midair collision of small planes | Sakshi
Sakshi News home page

రెండు విమానాలు ఢీ: నలుగురు మృతి

Aug 17 2015 9:14 AM | Updated on Aug 24 2018 7:24 PM

రెండు విమానాలు ఢీ: నలుగురు మృతి - Sakshi

రెండు విమానాలు ఢీ: నలుగురు మృతి

అమెరికాలో శాన్ డియాగో కౌంటీలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

శాన్ డియాగో: అమెరికాలో శాన్ డియాగో కౌంటీలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు చిన్న విమానాలు గగనంలో గుద్దుకోవడంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతానికి వెళుతుండగా  రెండు విమానాలు గాల్లో ఢీకొని పొలాల్లో కూలిపోయాయి.

రెండు ఇంజిన్ల సాబ్రిలైనర్ జెట్, సింగిల్ ఇంజిన్ సెస్ న్నా 172 విమానం పరస్పరం ఢీ కొన్నాయి. వెంటనే మంటలు వ్యాపించడంతో రెండు విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు ఆర్పుతుండగా అగ్నిమాపక దళానికి చెందిన ఒకరు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement