రిషితేశ్వరి కేసులో మరో ఇద్దరు.. ఇంకో డైరీ! | two more students role found in rishiteswari case, second diary found | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి కేసులో మరో ఇద్దరు.. ఇంకో డైరీ!

Aug 10 2015 7:13 PM | Updated on Aug 25 2018 5:33 PM

సీనియర్ల ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసులో మరో ఇద్దరు విద్యార్థుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సీనియర్ల ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసులో మరో ఇద్దరు విద్యార్థుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె డైరీలో కొట్టేసిన పేర్లు ఏవో కూడా తెలిసినట్లు సమాచారం. అలాగే, ఆమె రాసుకున్న మరో డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డైరీలో వివరాలు ఏంటనేది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆ డైరీలో తాను యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఉన్న మధురక్షణాలతో పాటు తాను బాధపడిన కొన్ని విషయాలను కూడా ఆమె రాసుకుందని, అయితే రాతలో మాత్రం కొంత తేడా ఉందని అంటున్నారు.

ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన ముగ్గురితో పాటు మరో ఇద్దరు సీనియర్ విద్యార్థుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణలో కూడా వీళ్ల పాత్ర వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిద్దరి తల్లిదండ్రులతో మాట్లాడారు గానీ, ఇంకా విద్యార్థులను అరెస్టు చేయలేదు. ఇక బాలసుబ్రహ్మణ్యం కమిటీ ప్రిన్సిపాల్ బాబూరావు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంది. చాలా విషయాలకు సంబంధించి ఆయన వైఖరి ఏకపక్షంగా ఉన్నట్లు గుర్తించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement