విక్రంగౌడ్‌ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్‌ | two more arrested in Vikram goud's firing case | Sakshi
Sakshi News home page

విక్రంగౌడ్‌ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్ట్‌

Sep 20 2017 6:41 PM | Updated on Sep 21 2017 1:39 PM

విక్రం గౌడ్‌ (ఫైల్‌ ఫొటో)

విక్రం గౌడ్‌ (ఫైల్‌ ఫొటో)

మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రం గౌడ్‌ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో మరో ఇద్దరి అరెస్ట్‌.

హైదరాబాద్‌ సిటీ: మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రం గౌడ్‌ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పట్టుబడిన ఇద్దరూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామానికి చెందిన మంచింటి వెంకట రమణ(38), కదిరి మండలం నిజాముల్‌ కాలనీకి చెందిన షేక్‌ మహ్మాద్‌ గౌస్‌(33)లని పోలీసులు తెలిపారు. కాల్పుల సంఘటన జరిగిన రోజు నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీళ్లిద్దరినీ పట్టుకుని రిమాండ్‌కు తరలించామని అధికారులు చెప్పారు.
(తనపై కాల్పులకు పథకం రచించింది విక్రమ్‌గౌడే)

Advertisement
 
Advertisement
Advertisement