లారీని ఢీకొన్న కారు; ఇద్దరి మృతి | two killed in road accident, car hits lorry | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న కారు; ఇద్దరి మృతి

Jul 26 2015 8:07 PM | Updated on Sep 3 2017 6:13 AM

లారీని ఢీకొన్న కారు; ఇద్దరి మృతి

లారీని ఢీకొన్న కారు; ఇద్దరి మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలం రామవరం సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డుప్రమాదం జరిగింది.

జగ్గంపేట(తూర్పుగోదావరి జిల్లా): ఆగి ఉన్న లారీని మారుతి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం సమీపంలో జాతీయరహదారి-16పై జరిగింది. వివరాలు.. వైజాగ్ శాంతినగర్‌కు చెందిన దుస్తుల వ్యాపారి కిశోర్ కుటుంబసభ్యులతో కలిసి రాజమండ్రి శనివారం రాజమండ్రి వెళ్లాడు.

కాగా, ఆదివారం రాజమండ్రి నుంచి తిరిగి వైజాగ్ వెళ్తుండగా మార్గ మధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కిశోర్ కుమారుడు నవీన్‌కృష్ణ(16), కుమార్తె పద్మశ్రీ(19)లు అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య జయప్రద, కుమారుడు సాయిలతో పాటు తనూ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని రాజానగరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement