ఇద్దరు విద్యార్థినులపై పదిమంది అత్యాచారం | Two college students gang raped by 10 youth | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థినులపై పదిమంది అత్యాచారం

Dec 27 2013 2:09 PM | Updated on Apr 4 2019 4:46 PM

పుదుచ్చేరిలో ఇద్దరు కళాశాల విద్యార్థినులపై పది మందికి పైగా యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో ఇద్దరు కళాశాల విద్యార్థినులపై పది మందికి పైగా యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులోని తిరువారూరు జిల్లా సన్నిలం సమీపంలోని సన్నానల్లూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు స్నేహితులు. వీరిలో ఒక యువతికి పుదుచ్చేరి రాష్ట్రం కారాక్కాల్‌కు చెందిన అధికార పార్టీ నాయకుడు ఒకరిని కొంతకాలంగా ప్రేమిస్తోంది.

ఈ క్రమంలో ఆ నేత మంగళవారం ఆమెను కారాక్కాల్‌కు పిలవడంతో ఒక స్నేహితురాలిని వెంట తీసుకుని ఆమె అక్కడకు వెళ్లింది.  ఇద్దరినీ అతను ఒక ఇంట్లో ఉంచి బయటకు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన పదిమందికి పైగా యువకులు ఆ ఇంట్లోకి చొరబడి ఇద్దరు యువతులపై అత్యాచారానికి పాల్పడి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement