రాందేవ్‌ జీన్స్‌ ఇలా ఉంటుందట! | twitter amuses on Baba Ramdev swadeshi jeans | Sakshi
Sakshi News home page

రాందేవ్‌ జీన్స్‌ ఇలా ఉంటుందట!

Sep 12 2016 11:36 AM | Updated on Sep 4 2017 1:13 PM

రాందేవ్‌ జీన్స్‌ ఇలా ఉంటుందట!

రాందేవ్‌ జీన్స్‌ ఇలా ఉంటుందట!

యోగా గురువు రాందేవ్‌ బాబా పంతజలి గ్రూప్‌ విదేశీ బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తున్నది.

యోగా గురువు రాందేవ్‌ బాబా పంతజలి గ్రూప్‌ విదేశీ బ్రాండ్లకు గట్టిపోటీ ఇస్తున్నది. న్యూడిల్స్‌, టూత్‌పేస్ట్‌, నెయ్యి, తేనే వంటి రకరకాల ఉత్పత్తులతో వందల కోట్ల గడిస్తున్న ఆయన తాజాగా వస్త్రరంగంలో అడుగుపెట్టి.. ఏకంగా ’స్వదేశీ జీన్స్‌’ను ప్రారంభిస్తానని ప్రకటించారు. అదేవిధంగా ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల కోసం ఫార్మల్‌ దుస్తులను కూడా తీసుకొచ్చే అవకాశముందని చెప్పారు.

యువతలో జీన్స్‌ ప్యాంట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉందని, దీని దృష్టిలో పెట్టుకొని విదేశీ బ్రాండ్లతో పోటీపడేందుకు ’స్వదేశీ జీన్స్‌’ను తీసుకొస్తున్నామని, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని మార్కెట్‌లో ప్రవేశపెడతామని ఆయన వెల్లడించారు. ఈ స్వదేశీ జీన్స్‌ ప్యాంట్లను ’పరిధాన్‌’ అని పిలిచే అవకాశముంది.

సహజంగానే రాందేవ్‌ స్వదేశీ జీన్స్‌ ప్రకటన నెటిజన్లలో ఆసక్తిని, కుతూహలాన్ని రేకెత్తించింది. చాలామంది నెటిజన్లు ఈ విషయమై తమదైనరీతిలో సెటైర్లు సంధించారు. రాందేవ్‌ తీసుకొచ్చే స్వదేశీ బ్రాండ్‌ జీన్స్‌ ఈ విధంగా ఉంటుందంటూ తమ బుర్రకు పదునుపెట్టి మరీ కొన్ని వెరైటీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అవి మీకోసం ఓ లుక్‌ వేయండి..

పతంజలి జీన్స్‌ బై రాందేవ్‌ బాబా


రాందేవ్‌ బాబా హెర్బల్‌ గొడుగు


పతంజలి హెర్బల్‌ రెయిన్‌కోట్‌


రాందేవ్‌ బాబా ఆయుర్వేదిక్‌ హెర్బల్‌ కంప్యూటర్‌

రాందేవ్‌ బాబా ఎకో ఫ్రెండ్లీ స్కూటర్‌


పతంజలి ఆయుర్వేదిక్‌ ఎకో ఫ్రెండ్లీ సోఫా

పతంజలి ఎకో ఫ్రెండ్లీ జీన్స్‌, షర్ట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement