పెళ్లి బృందం వాహనంపైకి దూసుకెళ్లిన ట్రక్ | Truck mows down eight members of marriage party near Dhanbad | Sakshi
Sakshi News home page

పెళ్లి బృందం వాహనంపైకి దూసుకెళ్లిన ట్రక్

Apr 19 2014 11:04 AM | Updated on Sep 2 2017 6:15 AM

పెళ్లి చేసుకుని మరి కొన్ని ఘడియల్లో అంతవారింటికి వెళ్లవలసిన నవ వధువు ఇంటి విషాదం అలముకుంది.

పెళ్లి చేసుకుని మరి కొన్ని ఘడియల్లో అంతవారింటికి వెళ్లవలసిన నవ వధువు ఇంటి విషాదం అలముకుంది. పెళ్లి చేసుకునేందుకు వరుడు ఇంటికి వెళ్తున్న వధువు కుటుంబ సభ్యుల బృందం వాహనంపైకి ట్రక్ దూసుకువెళ్లింది. ఆ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, నవవధువు తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

 

మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. గత అర్థరాత్రి జార్ఖండ్ రాష్ట్రంలో జంషెడ్పూర్లోని బ్రిది నుంచి మన్మన్ది కాలనీ వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ఘటనతో స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ట్రక్పై దాడి చేసి తగలబెట్టారు. దాంతో ట్రక్ డ్రైవర్ పరారైయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement