యూపీ అధికార పీఠం బీజేపీదే | times now-vmr openion poll gives bjp clear maority in uttarpradesh | Sakshi
Sakshi News home page

యూపీ అధికార పీఠం బీజేపీదే

Jan 30 2017 7:22 PM | Updated on Mar 29 2019 9:31 PM

టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుందట.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికారం పీఠం ఎవరిది? కాంగ్రెస్తో జట్టు కట్టిన అధికార సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ గెలుస్తుందా? లేక బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఓటర్లు కరుణ చూపుతారా? టైమ్స్ నౌ-వీఎంఆర్ ఒపీనియన్ పోల్ ప్రకారం బీజేపీ అధికారంలోకి వస్తుందట. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించింది.

యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మెజార్టీ సీట్లు సాధిస్తుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో తేలింది. యూపీ శాసనసభలో 403 సీట్లు ఉండగా, బీజేపీ 202 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 19 శాతం ఓట్లు అధికంగా వస్తాయని సర్వేలో తేలింది. కాగా అధికార ఎస్పీకి పరాజయం తప్పదని, ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి 147 సీట్లు వస్తాయని పేర్కొంది. దీంతో ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని అంచనా వేసింది. ఇక బీఎస్పీ కేవలం 47 సీట్లతో మూడో స్థానానికి పరిమితమవుతుందని సర్వేలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement