'కబాలి'కి సుల్తాన్‌కి అదే తేడా! | the difference between sultan, kabali | Sakshi
Sakshi News home page

'కబాలి'కి సుల్తాన్‌కి అదే తేడా!

Jul 20 2016 4:14 PM | Updated on Sep 4 2017 5:29 AM

'కబాలి'కి సుల్తాన్‌కి అదే తేడా!

'కబాలి'కి సుల్తాన్‌కి అదే తేడా!

మరో రెండురోజుల్లో 'కబాలి' విడుదల అవుతుండటంతో ఇటు ఫేస్‌బుక్‌లో, అటు ట్విట్టర్‌, వాట్సాప్‌లోనూ ఈ సినిమాపై ఎన్నో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

'పొద్దున్నే డాబాపైకెక్కి 'హలో హైదరాబాద్' అని అరిచాను.. 'కబాలిడా' అని రీసౌండొచ్చింది.. దానితోపాటే తుఫానులాంటి గాలి.. కింద పడిపోతే పైకిపోతానని గోడపట్టుకున్నానుగానీ పోయినా పర్లేదనిపించింది ఆ క్షణం నాకు..' హైదరాబాద్ నగరంలోని 'కబాలి' క్రేజ్ చెప్పేందుకు ఓ నెటిజన్ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ కామెంటే ఉదాహరణ.

మరో రెండురోజుల్లో 'కబాలి' విడుదల అవుతుండటంతో ఇటు ఫేస్‌బుక్‌లో, అటు ట్విట్టర్‌, వాట్సాప్‌లోనూ ఈ సినిమాపై ఎన్నో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. రజనీ అభిమానులైతే ఇప్పటినుంచే 'కబాలి' పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

సుల్తాన్-కబాలికి అదే తేడా
'కబాలి' సినిమా విడుదల అవుతున్న శుక్రవారం నాడు చెన్నైకి చెందిన స్టార్టప్ ఫైండ్ అస్ ఇండియా, బెంగళూరుకు చెందిన ఇన్నోవేటివ్ స్ట్రక్చరల్ సోల్యుషన్స్ కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ స్టార్‌ హీరో సినిమా విడుదల రోజున ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడం అత్యంత అరుదైన విషయం. దీనిపై కూడా జోకులు పేలుతున్నాయి. మామూలుగా ఇతర హీరోల సినిమాలు సెలవు రోజున విడుదల అవుతుంటాయి. కానీ, రజనీ సినిమా ఎప్పుడు రిలీజైతే.. అప్పుడే సెలవు వస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సెలవు కాబట్టి ఈద్‌ నాడు 'సుల్తాన్' సినిమాను రిలీజ్ చేసినట్టు సల్మాన్ ఖాన్ చెబితే.. నా సినిమా ఎప్పుడు విడుదలైతే అప్పుడే సెలవు ఉంటుందని రజనీ కౌంటర్ ఇస్తున్నట్టు ఫొటోలు క్రియేట్ చేసి అభిమానులు సర్క్యులేట్ చేస్తున్నారు. 'సుల్తాన్', 'కబాలి' మధ్య అదే తేడాని చెప్తున్నారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement