తెలంగాణ నిధులు కోరడం సరికాదు: టీజీ వెంకటేశ్ | TG Venkatesh comments on Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ నిధులు కోరడం సరికాదు: టీజీ వెంకటేశ్

Aug 19 2016 8:31 PM | Updated on Aug 10 2018 8:16 PM

నిధుల విషయంలో ఏపీతో మెలిక పెట్టడం టీఆర్ఎస్ కు తగదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.

 ఏపీకి కేంద్రం నిధులిస్తే తెలంగాణకూ ఇవ్వాలని టీఆర్‌ఎస్ నేతలు కోరడం సరికాదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కావాల్సినవి కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సరిగా లెక్కలు చూపనందుకే కేంద్రం ఏపీకి నిధులివ్వడం లేదనడం అవాస్తవమన్నారు. విభజన సమస్యలు రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో రాష్ట్రాభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసిరావాలని కోరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement