ఎత్తుకెళ్లి.. సామూహిక లైంగిక దాడి | Teenage girl abducted, gangraped in UP's Meerut | Sakshi
Sakshi News home page

ఎత్తుకెళ్లి.. సామూహిక లైంగిక దాడి

Apr 13 2015 1:21 PM | Updated on Aug 25 2018 4:14 PM

ఎత్తుకెళ్లి.. సామూహిక లైంగిక దాడి - Sakshi

ఎత్తుకెళ్లి.. సామూహిక లైంగిక దాడి

మీరట్: ఎన్ని చట్టాలు తెచ్చినా.. వాటినెంత కఠినంగా మార్చినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు.

మీరట్: ఎన్ని చట్టాలు తెచ్చినా.. వాటినెంత కఠినంగా మార్చినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ కర్మాగారంలో పనిచేస్తున్న పదిహేనేళ్ల బాలికను నూర్ నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద అడ్డుకున్న ఇద్దరు యువకులు బెదిరించి ఆటోలో తీసుకెళ్లారు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో కొట్టారు. చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక స్పృహకోల్పోవడంతో జురాన్పూర్ రైల్వే క్రాసింగ్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆమెను గుర్తించిన జురాన్పూర్కు చెందిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వివరాలు సేకరించి నిందితుల కోసం గాలింపులు జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement