అతనంటే ఇష్టంలేదని చెప్పడంతో... | Tamil Nadu: Jilted lover crushes girl to death using stone, surrenders after murder | Sakshi
Sakshi News home page

అతనంటే ఇష్టంలేదని చెప్పడంతో...

Apr 23 2017 3:30 PM | Updated on Sep 5 2017 9:31 AM

అతనంటే ఇష్టంలేదని చెప్పడంతో...

అతనంటే ఇష్టంలేదని చెప్పడంతో...

తనను ప్రేమించి ఆ తరువాత పక్కకు పెడుతోందన్న అక్కసుతో ఓ యువకుడు..

నాగపట్నం: తనను ప్రేమించి ఆ తరువాత పక్కకు పెడుతోందన్న అక్కసుతో ఓ యువకుడు, బీటెక్‌ విద్యార్థినిని బండరాయితో మోది హత్య చేసిన సంఘటన తమిళనాడులో శనివారం జరిగింది. ఆ తరువాత నిందితుడు మతన్‌రాజ్‌(22) పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పుదుకొట్టాయి జిల్లాకు చెందిన 18 ఏళ్ల బాధితురాలు చెన్నైలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. అంతకు ముందు ఆ విద్యార్థిని, మతన్‌రాజ్‌ ఒకరినొకరు ప్రేమించుకున్నారని, ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరిన తరువాత ఆమె అతన్ని పట్టించుకోవడం మానేసినట్లు తెలిసింది.

ఆమె ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ చూసిన మతన్‌రాజ్‌... ఆమెకు కాలేజీలో కొత్త స్నేహితులు దొరకడంతో తనకు దూరమైందని భావించాడు. శనివారం ఉదయం మతన్‌రాజ్‌ ఆమెను మాయిలాదుతురాయ్‌ బస్‌స్టేషన్‌లో కలుసుకుని పూంపుహార్‌ బీచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మాటల మధ్యలో తనకు అతనంటే ఇష్టంలేదని ఆమె చెప్పింది. దీంతో కోపోద్రోక్తుడైన మతన్‌రాజ్‌ ఆమెను హతమార్చాడు. అటుగా వెళ్తోన్న జాలర్లు రక్తపు మడుగులో పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement