ఆస్పత్రిపాలైన ప్రముఖ హీరో తండ్రి! | Tamil film director Chandrasekar hospitalised | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిపాలైన ప్రముఖ హీరో తండ్రి!

Aug 24 2016 3:11 PM | Updated on Sep 4 2017 10:43 AM

ఆస్పత్రిపాలైన ప్రముఖ హీరో తండ్రి!

ఆస్పత్రిపాలైన ప్రముఖ హీరో తండ్రి!

ప్రముఖ తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తీవ్ర అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు.

కొట్టాయం(కేరళ): ప్రముఖ తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తీవ్ర అస్వస్థతతో బుధవారం ఆస్పత్రిలో చేరారు. 71 ఏళ్ల వయస్సున్న ఆయన ఒక్కసారిగా పడిపోవడంతో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కుమారకుమ్‌లోని ఓ రిసార్ట్‌లో ఆయన పడిపోయారని, దీంతో ఆయన తలకు, వెన్నెముకకు గాయాలయ్యాయని ఆ వర్గాలు వివరించాయి. దీంతో ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపాయి.

ఎస్‌ఏ చంద్రశేఖర్‌ తమిళంలో పేరొందిన దర్శకుడు- నిర్మాత. ఆయన ఎన్నో హిట్‌ సినిమాలను తెరకెక్కించారు. ఆయన వారసుడిగా తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించిన విజయ్‌ ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. విజయ్ తాజా సినిమా తెలుగులో 'పోలీసోడు'గా డబ్‌ అయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement