సాక్షి, అమరావతి: తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించనున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు విజయ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని దుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అవుతారు. రాత్రి ఏడు గంటలకు పున్నమి ఘాట్‌కు చేరుకుని విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొంటారు. 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి చెన్నై తిరుగుపయనమవుతారు.


