అత్తామామలతో అనిరుధ్‌.. ప్రముఖులకు పెళ్లికి ఆహ్వానం! | Anirudh Ravichander Invites CM Vijay To Wedding Reception With Kavya Maran PM Modi Invited Too | Sakshi
Sakshi News home page

అత్తామామలతో అనిరుధ్‌.. ప్రముఖులకు పెళ్లికి ఆహ్వానం!

Oct 17 2026 2:24 PM | Updated on Oct 17 2026 2:48 PM

Anirudh Ravichander Invites CM Vijay To Wedding Reception With Kavya Maran PM Modi Invited Too

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖులను స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం విజయ్‌, ఆ రాష్ట్ర గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌లను కలిసి పెళ్లికి ఆహ్వానించారు.

ఈమేరకు దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌, కావేరి మారన్‌తో పాటు అనిరుధ్‌ కూడా పాల్గొన్నాడు.

నవంబర్‌ 11న
అనిరుధ్‌, కావ్య మారన్‌ల వివాహం గ్రీస్‌లో జరగనుందని, నవంబర్‌ 11న పెళ్లి ముహూర్తం ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. వివాహ తేదీ, వేదిక వివరాలు కూడా ఇంకా ఖరారైనట్లు అధికారికంగా వెల్లడించలేదు.

(ఇదీ చదవండి: అనిరుధ్‌తో కావ్యా మారన్‌ పెళ్లి: ఏజ్‌ గ్యాప్‌, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement