కాంగ్రెస్ చేరిన సినీ నటుడు కార్తీక్ | tamil actor karthik joins congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ చేరిన సినీ నటుడు కార్తీక్

Nov 5 2014 6:48 PM | Updated on Sep 2 2017 3:55 PM

కాంగ్రెస్ చేరిన సినీ నటుడు కార్తీక్

కాంగ్రెస్ చేరిన సినీ నటుడు కార్తీక్

తమిళ సీనియర్ నటుడు కార్తీక్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చెన్నై: తమిళ సీనియర్ నటుడు కార్తీక్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ అఖిల ఇండియా నాదలం మక్కల్ కచ్చిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

54 ఏళ్ల కార్తీక్ 2006లో రాజకీయ ప్రవేశం చేశారు. మొదట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. 2009 లోక్సభ ఎన్నికలకు ముందు సొంతంగా పార్టీ పెట్టారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తమిళనాడులో ఆయన పెట్టిన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

తమిళ, తెలుగు భాషాల్లో ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సీతాకోచిలుక, అభినందన, అన్వేషణ, గోపాలరావు గారి అబ్బాయి తదితర తెలుగు సినిమాల్లో కార్తీక్ నటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement