breaking news
tamil actor karthik
-
చాలా కాలం తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న తమిళ నటుడు
తమిళసినిమా: సీనియర్ నటుడు కార్తీక్ తీ ఇవన్ చిత్రం కోసం ఫైట్ చేశారు. ఈయన చాలా కాలం తరువాత కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. మనిదన్ సినీ ఆర్ట్స్ పతాకంపై నిర్మలాదేవి జయమురుగన్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి టి.ఎం.జయమురుగన్ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు రోజా మలరే, అడడా ఎన్న అళగు, సింధుబాద్ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారన్నది గమనార్హం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పిన నటుడు కార్తీక్ పేర్కొంటూ దర్శకుడు కథ చెప్పినప్పుడే అందులోని సత్తా తనకు అర్థం అయ్యిందన్నారు. తమిళ సంప్రదాయాన్ని, మన జీవన విధానాన్ని అందంగా తెరపై చూపించారన్నారు. చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారన్నారు. పాటల రూపకల్పన, చిత్రీకరణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఈ చిత్రం కోసం తాను నాలుగు పోరాట దృశ్యాల్లో నటించానని చెప్పారు. చాలా గ్యాప్ తరువాత నటించిన ఈ చిత్రం తన కెరీర్లో మంచి చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని కార్తీక్ పేర్కొన్నారు. చదవండి: Andrew Garfield: బ్రేకప్ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది! -
కాంగ్రెస్ చేరిన సినీ నటుడు కార్తీక్
చెన్నై: తమిళ సీనియర్ నటుడు కార్తీక్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీ అఖిల ఇండియా నాదలం మక్కల్ కచ్చిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 54 ఏళ్ల కార్తీక్ 2006లో రాజకీయ ప్రవేశం చేశారు. మొదట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. 2009 లోక్సభ ఎన్నికలకు ముందు సొంతంగా పార్టీ పెట్టారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తమిళనాడులో ఆయన పెట్టిన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తమిళ, తెలుగు భాషాల్లో ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సీతాకోచిలుక, అభినందన, అన్వేషణ, గోపాలరావు గారి అబ్బాయి తదితర తెలుగు సినిమాల్లో కార్తీక్ నటించారు.