ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వేధింపుల కారణంగానే తన కుమారుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకున్నాడంటూ తండ్రి ఆరోపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షలకు పైగా ఫాలోవర్లు కలిగిన ఇన్‌ఫ్లుయెన్సర్ చెన్నైలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంచర్ స్టూడియో సీఈఓ తన కుమారుడిని ఆన్‌లైన్‌లో వేధించారంటూ మృతుడి తండ్రి ఆరోపిస్తున్నారు.
ఫైనాన్స్ విత్ హరీష్.. పేరుతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఆర్థిక అంశాలకు కంటెంట్‌ను అందిస్తున్నాడు. హరీష్.. చెన్నైలో తాను అద్దెకు ఉంటున్న విల్లాలో ఉరివేసుకుని మరణించినట్లు సమాచారం. వెంచర్ స్టూడియో జెమూరియా ఇంక్ సీఈఓ జేసన్ శామ్యూల్ తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వేధించారని హరీష్ తండ్రి ఆరోపించారు.
శామ్యూల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో మెటా సంస్థ హరీష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేసిందని.. ఆ తర్వాత హరీష్ కొత్త ఖాతా ద్వారా వీడియోలు విడుదల చేస్తున్నాడని తెలిపారు. ఈ పరిణామాల క్రమంలో హరీష్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని.. దీంతో తన కుమారుడి ఆత్మహత్యకు దారితీసిందని ఆయనపేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై జేసన్ శామ్యూల్.. ఎక్స్ వేదికగా స్పందించారు. హరీష్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. అయితే, తాను హరీష్‌ను వేధింపులకు గురిచేయలేదని.. ఆయన వెల్లడించిన కొన్ని వివరాల్లో తప్పులను మాత్రమే ఎత్తిచూపానని స్పష్టం చేశారు. హరీష్‌కు సెబీ గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ లైసెన్స్ లేదని.. అలాగే తనకు ఏఎంఎఫ్‌ఐ లైసెన్స్ ఉన్నట్లు తప్పుగా ప్రచారం చేశారని శామ్యూల్ ఆరోపించారు. హరీష్ ఇటీవలే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నుంచిలా ఏఆర్‌ఎన్ నంబర్ పొందారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భార్యను కొట్టానని నిరూపిస్తారా?


