స్వైప్ కొత్త స్మార్ట్ఫోన్.. ధర తక్కువే! | Swipe Konnect Plus With 13-Megapixel Camera Launched at Rs. 4,999 | Sakshi
Sakshi News home page

స్వైప్ కొత్త స్మార్ట్ఫోన్.. ధర తక్కువే!

Aug 10 2016 8:42 AM | Updated on Sep 4 2017 8:43 AM

స్వైప్ కొత్త స్మార్ట్ఫోన్.. ధర తక్కువే!

స్వైప్ కొత్త స్మార్ట్ఫోన్.. ధర తక్కువే!

బడ్జెట్ ధరలో టాబ్లెట్ పీసీలు, ఫాబ్లెట్స్, స్మార్ట్ఫోన్లు ఆఫర్ చేసే స్వైప్ టెలికాం.. తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది.

బడ్జెట్ ధరలో టాబ్లెట్ పీసీలు, ఫాబ్లెట్స్, స్మార్ట్ఫోన్లు ఆఫర్ చేసే స్వైప్ టెలికాం.. తాజాగా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. స్వైప్ కనెక్ట్ ప్లస్ పేరుతో ఆవిష్కరించిన ఈ నూతన ఫోన్ ధరను రూ.4,999గా ప్రకటించింది. ఈ ఫోన్ ప్రత్యేకంగా స్నాప్డీల్లో మాత్రమే వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు స్వైప్ తెలిపింది. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్ను స్వైప్ రూపొందించింది. జెన్ సినీమ్యాక్స్ 3 మాదిరిగా స్యాండ్స్టోన్ ఫినిస్ బ్యాక్ ప్యానెల్ ఈ ఫోన్ ప్రత్యేకత.
 

స్వైప్ కనెక్ట్ ప్లస్ ఫీచర్లు...
5 అంగుళాల హెచ్డీ(720x1280 పిక్సెల్స్) ఐపీఎస్ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
1.2గిగిహెడ్జ్ క్వాడ్ కోర్ ఎస్ఓసీ
డ్యుయల్ సిమ్(రెగ్యులర్+మైక్రో)
2 జీబీ ర్యామ్
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ మెమెరీ
3000ఎంఏహెచ్ బ్యాటరీ
156 గ్రాములు
 కనెక్టివిటీ ఆప్షన్లు.. 3జీ, వై-ఫై, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, బ్లూటూత్,
                             3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, మైక్రో-యూఎస్బీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement