బహిష్కృతనేత భార్యకు కీలక పదవి | Swati Singh appointed UP BJP women's wing chief | Sakshi
Sakshi News home page

బహిష్కృతనేత భార్యకు కీలక పదవి

Oct 7 2016 8:32 PM | Updated on Mar 29 2019 9:31 PM

బహిష్కృతనేత భార్యకు కీలక పదవి - Sakshi

బహిష్కృతనేత భార్యకు కీలక పదవి

ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్కు పార్టీలో కీలక పదవి దక్కింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్కు పార్టీలో కీలక పదవి దక్కింది. యూపీ బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమెను నియమించారు.

బీఎస్పీ చీఫ్‌ మాయావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు దయాశంకర్ను బీజేపీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని దయాశంకర్ ఆరోపిస్తూ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో బీజేపీ ఆయనపై వేటు వేసింది. కాగా ఆయన భార్యకు బీజేపీలో అమిత ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement