కూతురి మెడకు చున్నీ బిగించి చంపేశారు.. | suspicious death of Inter student | Sakshi
Sakshi News home page

కూతురి మెడకు చున్నీ బిగించి చంపేశారు..

Jun 24 2016 2:26 PM | Updated on Aug 17 2018 2:53 PM

కూతురి మెడకు చున్నీ బిగించి చంపేశారు.. - Sakshi

కూతురి మెడకు చున్నీ బిగించి చంపేశారు..

ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య జరిగింది. తమ కుమార్తె ప్రవర్తన కారణంగా కుటుంబం పరువుపోతుందని భావించిన తల్లిదండ్రులు ..

ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్య జరిగింది. తమ కుమార్తె ప్రవర్తన కారణంగా కుటుంబం పరువుపోతుందని భావించిన తల్లిదండ్రులు కన్నకూతుర్ని కడతేర్చారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. చౌహాన్ లక్ష్మణ్ కుమార్తె అఖిల(17) ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటోంది.

ఆమెకు నేరడిగొండ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహేందర్‌తో పరిచయం ఉంది. ఏడాది నుంచి వారు కలిసి తిరుగుతున్నారు. గురువారం రాత్రి అతడు అఖిల ఇంటికి వచ్చాడు. ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారంపై అఖిలకు ఎంత నచ్చచెప్పినా ఫలితం లేదకపోయింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తెల్లవారుజామున అఖిలను చున్నీని మెడకు బిగించి చంపేశారు. వేరే కులానికి చెందిన యువకుడితో  చనువుగా తిరగటం నచ్చక కూతురిని చంపేశామంటూ శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు లొంగిపోయారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement