సుష్మకు కిడ్నీ మార్పిడి చేసిన వైద్యులు | Sushma undergoes kidney transplant at AIIMS | Sakshi
Sakshi News home page

సుష్మకు కిడ్నీ మార్పిడి చేసిన వైద్యులు

Dec 10 2016 4:07 PM | Updated on Aug 16 2018 4:04 PM

సుష్మకు కిడ్నీ మార్పిడి చేసిన వైద్యులు - Sakshi

సుష్మకు కిడ్నీ మార్పిడి చేసిన వైద్యులు

విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్(64)కు ఎయిమ్స్ లో శనివారం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహించారు.

న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్(64)కు ఎయిమ్స్ లో శనివారం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఎయిమ్స్ డైరెక్టర్ ఎమ్ సీ మిశ్రా, సర్జన్లు వీకే బన్సల్, వీ శీను, నెఫ్రాలజిస్టు సందీప్ మహాజన్ లు ఐదు గంటల పాటు ఆపరేషన్ ను నిర్వహించినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్జరీ మధ్యాహ్నం 2.30నిమిషాలకు ముగిసింది. ఆ తర్వాత సుష్మను ఐసీయూకు మార్చినట్లు సమాచారం.
 
అయితే సుష్మాకు కిడ్నీ దానం చేసిన దాత వివరాలు తెలియరాలేదు. కొంతకాలంగా సుష్మా డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీనికి తోడు కిడ్నీ ఫెయిల్ కావడంతో ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement