స్కూళ్లలో బుక్స్‌ అమ్మొద్దు | Stop Selling Textbooks, Uniforms. You Aren't A Business: CBSE To Schools | Sakshi
Sakshi News home page

స్కూళ్లలో బుక్స్‌ అమ్మొద్దు

Apr 21 2017 12:48 PM | Updated on Sep 5 2017 9:20 AM

విద్యాలయాల్లో వ్యాపారం చేయొద్దని సీబీఎస్‌ఈ ఆదేశించింది.

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ పాఠశాలలో పుస్తకాలు, నోట్‌ బుక్‌లు, బూట్లు, యూనిఫాం, బ్యాగులు విద్యార్థులకు అమ్మటంపై కేంద్ర ఉన్నత విద్యామండలి (సీబీఎస్‌ఈ) తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యాలయాలు అంటే చదువు నేర్పేందుకు మాత్రమేనని, వ్యాపార కేంద్రాలు కావని విమర్శించింది. ఇటీవల సీబీఎస్‌ఈ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ స్కూళ్లలో విచ్చలవిడిగా విద్యార్థులకు సంబంధించిన సామాగ్రిని తమ వద్దనే కొనాలని, వారి తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై సీబీఎస్‌ఈ స్పందించింది.

సీబీఎస్‌ఈ నియమాల ప్రకారం పాఠశాల ఆవరణలో గానీ, వారు సూచించిన షాపుల్లోనే పుస్తకాలు కొనమని చెప్పటం నేరమని ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సీబీఎస్‌ఈ, ఎన్సీఈఆర్‌టీ ప్రచురించిన పుస్తకాలనే కొనాలని తల్లిదండ్రులకు సూచించింది. ఇప్పటికే రెండు వేల ప్రైవేట్‌ స్కూళ్లకు ఎన్సీఈఆర్‌టీ పుస్తకాలను సరఫరా చేసినట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement