శృతిహాసన్‌పై దాడి కేసులో ఓ వ్యక్తి అరెస్టు | Spot boy held for stalking actress Shruti Haasan | Sakshi
Sakshi News home page

శృతిహాసన్‌పై దాడి కేసులో ఓ వ్యక్తి అరెస్టు

Nov 23 2013 10:44 PM | Updated on Sep 2 2017 12:54 AM

సినీనటి శృతిహాసన్పై దాడి కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు.

చెన్నై: సినీనటి శృతిహాసన్పై దాడి కేసులో పోలీసులు అడుగు ముందుకేశారు. ముంబై ఫిల్మ్సిటీలో పనిచేస్తున్న అశోక్ శంకర్ త్రిముఖి(45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు పుటేజీని పరిశీలించిన పోలీసులకు శంకర్ త్రిముఖి పట్టుబడ్డాడు. కాగా అతను మాత్రం శృతిహాసన్ ఎవరో తనకు తెలీదని తెలిపాడు.


తన ఇంట్లోకి అక్రమంగా చొరబడిన గుర్తుతెలియని వ్యక్తిపై హీరోయిన్ శ్రుతిహాసన్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై శివార్లలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఆమె ఇంట్లోకి మంగళవారం ఉదయం ఓ వ్యక్తి అక్రమంగా చొరబడిన విషయం తెలిసిందే. ఆరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో శ్రుతిహాసన్ తన అపార్టుమెంట్లో ఉండగా డోర్ బెల్ మోగింది. ఆమె తలుపు తీయగానే అగంతకుడు లోనికి చొరబడ్డాడు. తనను ఎందుకు గుర్తు పట్టడంలేదంటూ నిలదీశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement