ఉమెన్స్ డేకి స్పైస్ జెట్ స్పెషల్ ఆఫర్ | SpiceJet to upgrade, reserves seats for solo female travelers | Sakshi
Sakshi News home page

ఉమెన్స్ డేకి స్పైస్ జెట్ స్పెషల్ ఆఫర్

Mar 6 2017 7:43 PM | Updated on Mar 3 2020 7:07 PM

ఉమెన్స్ డేకి స్పైస్ జెట్ స్పెషల్ ఆఫర్ - Sakshi

ఉమెన్స్ డేకి స్పైస్ జెట్ స్పెషల్ ఆఫర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పైస్ జెట్ విమానమెక్కే మహిళా ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

న్యూఢిల్లీ :  అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పైస్ జెట్ విమానమెక్కే మహిళా ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2017 మార్చి 8న స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించే మహిళలు స్పైస్ మ్యాక్స్ లోకి అప్ గ్రేడ్ అవుతారని పేర్కొంది. అంతేకాక బుధవారం రోజు ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం ఒక వరుసమొత్తాన్ని కేటాయించనున్నట్టు  స్పైస్ జెట్ ప్రకటించింది.'' 2017 మార్చి 8న ఒంటరిగా ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నాం. ఒకవేళ అందుబాటులో ఉంటే ఉచితంగా స్పైస్ మ్యాక్స్ సీట్లలోకి వారిని అప్ గ్రేడ్ చేస్తాం'' అని స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
 
2017 మార్చి 8 నుంచి నాలుగో వరుస మొత్తాన్ని స్పైస్ జెట్ మహిళలకే కేటాయించనుంది. మహిళలకు స్పెషల్ సీట్లను తొలుత  ఎయిర్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది.  స్పెషల్ సీటింగ్ కేటాయింపుల వల్ల సోలోగా ప్రయాణించే మహిళకు సౌకర్యవంతంగా ఉంటుందని స్పైస్ జెట్ తెలిపింది. స్పైస్ మ్యాక్స్ ఆఫర్ కింద స్పైస్ జెట్ విమానయాన సంస్థ తమ వెబ్ సైట్లో బుకింగ్స్ పై ఫ్లాట్ పై 15 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. సోమవారం రోజు ఈ ఆఫర్ కింద డిస్కౌంట్లు వర్తించవు. రెండు వైపుల ప్రయాణాలకు ఇది అందుబాటులో ఉంటుంది. 2017 మార్చి 31 వరకు స్పైస్ మ్యాక్స్ ఆఫర్ కింద ప్రయాణికులు బుకింగ్స్ చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement