ఏపీకి స్పెషల్... స్పెషల్ స్టేటస్
ఏపీకి స్పెషల్... స్పెషల్ స్టేటస్ ఉంటుందని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.
న్యూఢిల్లీ : ఏపీకి స్పెషల్... స్పెషల్ స్టేటస్ ఉంటుందని కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. మంగళవారం న్యూఢిల్లీలో సుజనా చౌదరి విలేకర్లతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నామని సుజనాచౌదరి స్పష్టం చేశారు.


