సిట్‌ ముందు నాలుగుగంటలే | SIT enquiry on art director chinna | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: సిట్‌ ముందు నాలుగుగంటలే

Jul 25 2017 2:57 PM | Updated on Nov 6 2018 4:42 PM

సిట్‌ ముందు నాలుగుగంటలే - Sakshi

సిట్‌ ముందు నాలుగుగంటలే

టాలీవుడ్‌ను కుదుపుతున్న డ్రగ్స్‌ కేసులో ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాపై సిట్ విచారణ ముగిసింది.

ముగిసిన చిన్నా విచారణ
మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ఆర్ట్‌ డైరెక్టర్‌



హైదరాబాద్‌: టాలీవుడ్‌ను కుదుపుతున్న డ్రగ్స్‌ కేసులో ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాపై సిట్ విచారణ ముగిసింది. కేవలం నాలుగు గంటలపాటే ఆయనను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. అనంతరం మీడియా కంటపడకుండా ఆయన ఎక్సైజ్‌శాఖ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు విచారించారు.

ఇప్పటివరకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామ్యాన్ శ్యామ్‌ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌లను ప్రశ్నించిన సిట్‌ అధికారుల ఎదుట తాజాగా ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా వచ్చారు. డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఎప్పటినుంచి డ్రగ్స్‌ వాడుతున్నారు? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? తదితర ప్రశ్నలను సిట్‌ అధికారులు చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చిన్నా నుంచి వివరాలు రాబట్టిన సిట్‌ అధికారులు త్వరగా ఆయన విచారణను ముగించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ వ్యవహారంతో పెద్దగా సంబంధాలు లేవనే ఉద్దేశంతోనే చిన్నా విచారణను త్వరగా విచారించారా? అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement