breaking news
art director chinna
-
పూరీతో సంబంధాలపైనే ఫోకస్!
- ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించిన ఎక్సైజ్ సిట్ - కెల్విన్‌తో సంబంధాలపై ఆరా - ముగ్గురు వ్యాపారవేత్తలను కూడా ప్రశ్నించిన సిట్ సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో మంగళవారం సినీ ఆర్ట్ డైరెక్టర్ ధర్మారావు అలియాస్ చిన్నాను సిట్ విచారించింది. ఉదయం 10.30కి ప్రారంభమైన విచారణలో.. ప్రధానంగా చిన్నాకు, పూరీ జగన్నాథ్‌కు మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. పూరీతో కలసి డ్రగ్స్ తీసుకున్నారా అని ప్రశ్నించగా తనకు అలాంటి అలవాటేదీ లేదని చిన్నా చెప్పినట్టు తెలుస్తోంది. పూరీతో కలసి ఎక్కువ సినిమాలకు పనిచేయడం వల్ల తన పేరు తెరమీదకు వచ్చి ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈవెంట్ మేనేజర్‌గానే కెల్విన్‌తో పరిచయం ఏర్పడిందని.. దాంతో పలుమార్లు ఫోన్లో మాట్లాడానని చెప్పినట్లు తెలిసింది. పూరీ జగన్నాథ్ ద్వారా చిన్నాకు డ్రగ్స్ అలవాటైనట్లుగా కెల్విన్ చెప్పాడని అధికారులు ప్రస్తావించగా.. అది అవాస్తవమని, కావాలంటే పరీక్షలు చేసుకోవచ్చని స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంగా సిట్ అధికారులు చిన్నాను 25కు పైగా ప్రశ్నలు వేశారని తెలిసింది. ఇక మధ్యాహ్నం 1.45 గంటల సమయంలోనే చిన్నా విచారణ ముగిసి బయటికి వచ్చారు. ఈ కేసులో ఇప్పటిదాకా విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖుల్లో చిన్నా విచారణే తక్కువ సమయంలో ముగియడం గమనార్హం. నేడు చార్మి వంతు పూరీ జగన్నాథ్‌తో కలసి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న హీరోయిన్ చార్మి బుధవారం సిట్ విచారణకు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ఎక్కడ కోరితే అక్కడ విచారించేందుకు సిద్ధమంటూ తామిచ్చిన అవకాశాన్ని చార్మి సద్వినియోగం చేసుకోలేదని.. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఆమె సిట్ కార్యాలయంలోనే విచారణకు హాజరవుతారని వెల్లడించారు. పూరీ జగన్నాథ్‌తో కలసి ఆమె పలువురికి డ్రగ్స్ అలవాటు చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో చార్మిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశముందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. చార్మి పదే పదే కెల్విన్‌తో వాట్సాప్ చాటింగ్, కాల్స్ చేశారని.. అతడితో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని.. వాటి ఆధారంగా విచారిస్తామని చెప్పారు. కెల్విన్ ఇంట్లో సోదాలు డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ నివాసంలో సిట్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వాస్తవా నికి కెల్విన్ అరెస్టు సమయంలోనే అతడి నివాసంలో తనిఖీలు చేసేందుకు ప్రయత్నించామని అధికారులు తెలిపారు. కానీ కెల్విన్ కుటుంబ సభ్యులు ఎక్సైజ్ అధికారులపై దాడికి పాల్పడటంతో పూర్తిస్థాయిలో సోదా చేయలేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి తీసుకుని మంగళవారం తిరిగి సోదాలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కెల్విన్ వ్యక్తిగత కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ను, గతంలో వాడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎవరా ముగ్గురు వ్యాపారవేత్తలు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ప్రశ్నిస్తున్న సమయంలోనే సిట్ అధికారులు ముగ్గురు వ్యాపారవేత్తలను కూడా పిలిపించి విచారించారు. హైదరాబాద్‌కు చెందిన బానోత్ సౌరభ్, ఆకుల రిషితేష్, అంకిత్ అగర్వాల్‌లను విచారిస్తున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. కానీ వారు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ తరహా వ్యాపారం చేస్తారు, వారికీ ఈ డ్రగ్ కేసుకు ఉన్న లింకులు ఏమిటన్న వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. దీనిపై సిట్ మీడియా లైజనింగ్ అధికారులను కోరినా... తమ వద్ద వారి పేర్లు తప్ప ఇతర వివరాలేవీ లేవని పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురిలో ఒకరు ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల సంస్థను నిర్వహిస్తున్నారని, ఆ ఉత్పత్తిని అడ్డుపెట్టుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నారని సిట్ అనుమానిస్తోంది. -
సిట్ ముందు నాలుగుగంటలే
-
సిట్ ముందు నాలుగుగంటలే
ముగిసిన చిన్నా విచారణ మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన ఆర్ట్ డైరెక్టర్ హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదుపుతున్న డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నాపై సిట్ విచారణ ముగిసింది. కేవలం నాలుగు గంటలపాటే ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం మీడియా కంటపడకుండా ఆయన ఎక్సైజ్‌శాఖ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడేందుకు విచారించారు. ఇప్పటివరకు దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్, నవదీప్‌లను ప్రశ్నించిన సిట్ అధికారుల ఎదుట తాజాగా ఆర్ట్ డైరెక్టర్ చిన్నా వచ్చారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఎప్పటినుంచి డ్రగ్స్ వాడుతున్నారు? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చిన్నా నుంచి వివరాలు రాబట్టిన సిట్ అధికారులు త్వరగా ఆయన విచారణను ముగించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంతో పెద్దగా సంబంధాలు లేవనే ఉద్దేశంతోనే చిన్నా విచారణను త్వరగా విచారించారా? అన్నది తెలియాల్సి ఉందని అంటున్నారు. -
సిట్ కార్యాలయానికి వచ్చిన చిన్నా...
-
సిట్ కార్యాలయానికి వచ్చిన చిన్నా...
హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ విచారణ ఆరో రోజు కొనసాగుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన పది గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు జారీ చేసిన 12మందిలో అయిదుగురు ( పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్)ను సిట్ అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఇవాళ చిన్నా హాజరు కాగా, మరో ఆరుగురిని ప్రశ్నించాల్సి ఉంది. మీడియా కంట పడకుండా మూడు వాహనాలు మారి సిట్ కార్యాలయానికి చిన్నా చేరుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద 22 చిత్రాలకు పని చేశారు. విచారణ ఎదుర్కొంటున్న వారు చెబుతున్న అంశాల ఆధారంగా సిట్ అధికారులు క్రాస్ చెక్ చేస్తున్నారు. వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చేలా ఆధారాలూ సేకరించినట్లు సమాచారం. వాటి ఆధారంగా మరో నలుగురు సినీ ప్రముఖులకు నేడో రేపో నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
నా జీవితంలో డ్రగ్స్ చూడలేదు: హీరో
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంతో తమకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదన్నారు. అలాంటిది మీడియాలో నా పేరు కూడా రావడం ఆశ్ఛర్యానికి గురిచేసింది. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, ఈ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియా దయచేసి వాస్తవాలు తెలుసుకుని వెలుగులోకి తేవాలని కోరారు. డ్రగ్స్ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అన్నారు. టీవీల్లో నాపేరు చూసి షాక్ గురయ్యానని, డ్రగ్స్ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని చెప్పారు. అసలు తనకు ఎలాంటి అలవాట్లు లేవని తెలిపారు. డ్రగ్స్ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.