సిట్‌ కార్యాలయానికి వచ్చిన చిన్నా... | Drug rmafia case: art director chinna appears before SIT | Sakshi
Sakshi News home page

మూడు వాహనాలు మారి.. చిన్నా..

Jul 25 2017 10:03 AM | Updated on Mar 22 2019 1:53 PM

సిట్‌ కార్యాలయానికి వచ్చిన చిన్నా... - Sakshi

సిట్‌ కార్యాలయానికి వచ్చిన చిన్నా...

డ్రగ్స్‌ మాఫియా కేసులో సిట్‌ విచారణ ఆరో రోజు కొనసాగుతోంది.

హైదరాబాద్‌: డ్రగ్స్‌ మాఫియా కేసులో సిట్‌ విచారణ ఆరో రోజు కొనసాగుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా మంగళవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన పది గంటలకు సిట్‌ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో నోటీసులు జారీ చేసిన 12మందిలో అయిదుగురు ( పూరీ జగన్నాథ్‌, శ్యామ్‌ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌)ను సిట్‌ అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఇవాళ చిన్నా హాజరు కాగా, మరో ఆరుగురిని ప్రశ్నించాల్సి ఉంది. 

మీడియా కంట పడకుండా మూడు వాహనాలు మారి సిట్‌ కార్యాలయానికి చిన్నా చేరుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వద్ద 22 చిత్రాలకు పని చేశారు. విచారణ ఎదుర్కొంటున్న వారు చెబుతున్న అంశాల ఆధారంగా సిట్‌ అధికారులు క్రాస్‌ చెక్‌ చేస్తున్నారు. వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చేలా ఆధారాలూ సేకరించినట్లు సమాచారం. వాటి ఆధారంగా మరో నలుగురు సినీ ప్రముఖులకు నేడో రేపో నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement