జర్మన్‌లోని ప్రఖ్యాత మ్యూనిక్ నగరం మంగళవారం కాల్పులతో దద్దరిల్లింది. సబర్బన్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మ్యూనిక్: జర్మన్‌లోని ప్రఖ్యాత మ్యూనిక్ నగరం మంగళవారం కాల్పులతో దద్దరిల్లింది. సబర్బన్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో దుండగుడు.. ఓ మహిళా పోలీసు నుంచి తుపాకి లాక్కుని కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల్లో మహిళా పోలీసుల సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు చెప్పారు.
అరగంట ఉత్కంఠ అనంతరం నిందితుడిని బంధించగలిగామని, ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి అపాయం లేదని పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిగిన సబర్బన్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మ్యూనిక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వీలుండటంతో ఇది ఉగ్రచర్యేమోనని అధికారులు హడలిపోయారు. సరిగ్గా ఏడాది కిందట మ్యూనిక్‌లోని షాపింగ్ మాల్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడిలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.