బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో శివరాజ్ సింగ్ హవా | Shivraj Singh Chouhan leading in Budhni, Vidisha | Sakshi
Sakshi News home page

బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో శివరాజ్ సింగ్ హవా

Dec 8 2013 11:22 AM | Updated on Sep 2 2017 1:24 AM

బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో శివరాజ్ సింగ్ హవా

బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో శివరాజ్ సింగ్ హవా

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేస్తున్న బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బరిలో నిలిచిన బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో  ఆయన హవా కొనసాగుతుంది. బుధ్నిలో ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేంద్ర సింగ్ చౌహాన్ కంటే 12,777 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే విదిశలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశాంక్ భార్గవ కంటే దాదాపు 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

 

గతంలో బుధ్నినియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపోందారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే గతంలో విదిశ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభకు ఎన్నికైయ్యారు. బీజేపీ గట్టిపట్టున్న విదిశ లోక్ సభ నియోజకవర్గానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement