
న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ(బీజేపీ) నూతన జాతీయ అధ్యక్షుని ఎంపికకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పదవికి తగిన నేత ఎంపిక కోసం అధిష్ఠానం కొన్నాళ్లుగా కసరత్తు నిర్వహిస్తోంది.
దీనిలో భాగంగా ఆర్ఎస్ఎస్ తో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరిపిందని సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి శివరాజ్ సింగ్ చౌహన్ తో పాటు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల తరువాత అధ్యక్షుని ఎంపిక జరగనుంది. సెప్టెంబర్ లో బీజేపీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ భావిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరగడం లాభదాయకమని బీజేపీ అనుకుంటోందని సమాచారం.
శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో జైట్ అనే గ్రామంలో 1059 మార్చి 5న జన్మించారు. అతని తండ్రి పేరు ప్రేమ్ సింగ్ చౌహాన్. తల్లి పేరు సుందర్ బాయి. అతని తండ్రి వృత్తి రీత్యా రైతు. శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. శివరాజ్, సాధన దంపతులకు ఇద్దరు కుమారులు. 1972లో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. లో చేరారు. ఇక్కడ నుండి ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. దీని తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు . ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ ప్రజలకు సేవలు అందించారు.