సూళ్లురుపేటలో నిలిచిపోయిన షార్‌ వాహనాలు | Shar vechicles stopped in effect of Ap status bandh in Nellore district | Sakshi
Sakshi News home page

సూళ్లురుపేటలో నిలిచిపోయిన షార్‌ వాహనాలు

Aug 29 2015 11:23 AM | Updated on Jul 24 2018 1:12 PM

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది.

సూళ్లురుపేట(నెల్లూరు జిల్లా): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం కేఆర్‌పీ కాలనీ వద్ద శ్రీహరికోట-సూళ్లురుపేట రోడ్డులో వైఎస్సార్‌సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా షార్‌కు వెళ్లే వాహనాలు సుమారు రెండుగంటల పాటు నిలిచిపోయాయి. బంద్తో పట్టణంలోని పలు దుకాణాలు మూతపడ్డాయి. అంతేకాకుండా అపాచీ, నిప్పో వంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం బంద్ సందర్భంగా మూసివేసినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement