యూఎస్లో కాల్పులు: ఐదుగురు మృతి | Several people killed in Houston-area shooting | Sakshi
Sakshi News home page

యూఎస్లో కాల్పులు: ఐదుగురు మృతి

Jul 10 2014 9:20 AM | Updated on Aug 25 2018 6:21 PM

యూఎస్లోని హ్యూస్టన్ శివారు ప్రాంతం బుధవారం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది.

యూఎస్లోని హ్యూస్టన్ శివారు ప్రాంతం బుధవారం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. హ్యూస్టన్ శివారులోని స్ప్రింగ్ ప్రాంతంలోని నివాసాలపై కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు పెద్దవారు ఉన్నారని చెప్పింది. వారి ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.

 

దీంతో వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు పోలీసులు ముమ్మరం చేశారని మీడియా పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement