ఏడేళ్ల బాలికపై అత్యాచారం | Seven year old girl raped | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై అత్యాచారం

Sep 25 2014 11:07 PM | Updated on Jul 28 2018 8:51 PM

హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణ సంఘటన జరిగింది. ఏడేళ్ల వయసున్న ఓ చిన్నారి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ముక్కుపచ్చలారని చిన్నారులని కూడా చూడకుండా అఘాయిత్యాలు చేస్తున్నారు మృగాళ్లు. హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణ సంఘటన జరిగింది. ఏడేళ్ల వయసున్న ఓ చిన్నారి బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అమ్మాయి పుట్టినరోజు కావడంతో ఆమె కోసం కొనుగోళ్లు చేసేందుకు తాము బజారుకు వెళ్లామని, కానీ తిరిగి వచ్చేలోపు ఛోటేదాస్ అనేవ్యక్తి ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడని పాప తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement