రామేశ్వరంలో భద్రత పెంపు | Security stepped up in Rameswaram | Sakshi
Sakshi News home page

రామేశ్వరంలో భద్రత పెంపు

Aug 22 2013 3:02 PM | Updated on Sep 1 2017 10:01 PM

ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో తమిళనాడులోని రామేశ్వరంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

రామేశ్వరం(తమిళనాడు) : ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో తమిళనాడులోని రామేశ్వరంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.  శ్రీలంకలోని జాఫ్నా నుంచి సముద్రమార్గం ద్వారా తీవ్రవాదులు రామేశ్వరంలోకి చొరబడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. తీవ్రవాదులు మధురై, మయిలాడుతురైలలో దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది తీవ్రవాదులు సముద్రమార్గంలో ఇక్కడకు ఇచ్చే అకాశం ఉన్నట్లు సమాచారం  ఉందని మయిల్వాహనన్ ఎస్పి చెప్పారు. అపరచిత వ్యక్తులు ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారమందించమని సముద్రతీరప్రాంతవాసులను ఆయన కోరారు.

గత రాత్రి నుంచి తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశారు. తీరప్రాంతంలోని భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతానికి వచ్చే బోట్లనన్నింటినీ తనిఖీ చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement