ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకుని.. ప్రాణాలర్పించిన బాలుడు! | school boy saves hundred of lives by obstructing suicide bomber | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకుని.. ప్రాణాలర్పించిన బాలుడు!

Jan 10 2014 2:31 PM | Updated on Nov 6 2018 8:35 PM

ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకుని.. ప్రాణాలర్పించిన బాలుడు! - Sakshi

ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకుని.. ప్రాణాలర్పించిన బాలుడు!

స్కూలు మొత్తాన్ని పేల్చేద్దామనుకున్న ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకోడానికి తన ప్రాణాలు సైతం అర్పించాడో బాలుడు!!

స్కూలు మొత్తాన్ని పేల్చేద్దామనుకున్న ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకోడానికి తన ప్రాణాలు సైతం అర్పించాడో బాలుడు!! ఈ సంఘటన పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూంఖ్వా రాష్ట్రంలో జరిగింది. అక్కడి హంగు జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఐతెజాజ్ అనే ఈ బాలుడు ఆత్మాహుతి బాంబర్ను అడ్డుకోగా, అతడు అక్కడికక్కడే బాంబు పేల్చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణాలు పోతాయని తెలిసినా.. స్కూలు గేటు నుంచి బాంబర్ను లోపలికి రాకుండా అడ్డుకోవడంతో వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు దక్కాయి.

పాక్ వార్తా పత్రికలు ఆ బాలుడి త్యాగాన్ని ఘనంగా శ్లాఘించాయి. సామాన్యులు చూపించే ఇలాంటి ధైర్యం అందరికీ స్ఫూర్తినిస్తుందని, ఉగ్రవాదులపై పోరాడేందుకు ధైర్యం ఇస్తుందని డాన్ పత్రిక తన సంపాదకీయంలో తెలిపింది. గతంలో తెహరిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొన్న మలాలా యూసఫ్జాయ్ ఉదంతాన్ని కూడా డాన్ ప్రస్తావించింది. ఆమెలాగే ఐతెజాజ్ హుస్సేన్ కూడా అసమాన ధైర్యసాహసాలు చూపించి, తన ప్రాణాలు అర్పించాడని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement